LLA ఆన్లైన్ అన్నది ఒక గొప్ప వేదిక.దీని ద్వారా విద్యార్థులు, దృశ్యకళను నేర్చుకోవచ్చు. తమలోని కళాత్మకతను అన్వేషించుకోవచ్చు. ఇది ఒక క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమం. ప్రతి కోర్స్ కొన్ని శిక్షణ గుళికలుగా సమర్పించబడతాయి. ప్రగతిశీలమైన క్రమంలో అందజేయబడతాయి. తదుపరి పాఠానికి వెళ్లేముందు జరిగినది పూర్తిగా అర్థమయ్యేరీతిలో సమర్పించబడుతుంది.
ఒక పాఠం ఒక video lesson ద్వారా సమర్పించబడుతుంది. ఆఖరిలో ఒక అసైన్మెంట్ ఉంటుంది. దాని ద్వారా విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాన్ని అభ్యాసం చేసి చూడవచ్చు. LLA ఆన్లైన్ ని రూపొందించినవారు, Light & Life Academyలో నేర్చుకున్న పూర్వ విద్యార్థులే. ప్రస్తుతం విభిన్న
ఫోటోగ్రఫీ రంగాలలో నిపుణులుగా ఉన్నవారే. వారందరూ ఈ క్రమమైన, కాలక్రమమైన తీరును బాగా ఆకళింపు చేసుకున్నవారే. అందుకే ప్రతి ఒక్క విద్యార్థినీ వాళ్లు ఈ ప్రోగ్రాంలో సవ్యంగా నడిపించి కావలసిన మార్పులు కూర్పులు చేస్తూ, మంచి చిత్రం ని సృష్టించేందుకు వారిని ప్రోత్సహిస్తారు. నేర్చుకునే తీరు, నేర్చుకున్న విషయం చాలా గొప్ప స్థాయిలో ఉండేందుకు వీరు చేసే ప్రయత్నం ఇది.
LLA ఆన్లైన్ లో లభించే ప్రతి ఫోటోగ్రఫీ కోర్స్లో ఒక అసైన్మెంట్ ప్రక్రియ ఉంటుంది. అది చేయకుంటే, విద్యార్థి తదుపరి స్థాయికి వెళ్లడం, కోర్స్ పూర్తి చేయడం అనేది జరగదు.
ఈ కోర్సులు తొమ్మిది భారతీయ భాషలలో లభిస్తాయి. ( బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, తమిళం, తెలుగు ) మరియు ఆంగ్లం (English)
LLA ఆన్లైన్ నేపథ్యంలోని కథ
Brooks Institute, California, USAలో ఫోటోగ్రఫీ degree పొంది, హాలీవుడ్ లో పేరుమోసిన పెద్దవాళ్ల దగ్గర పనిచేస్తూ, భారతదేశానికి తిరిగివచ్చిన కొంతమందిలో ఇక్బాల్ మొహమ్మద్ గారు కూడా ఒక్కరు. ఆ అవకాశాలన్నీ తనకు లభించడం ఎంతో అదృష్టమని ఆయన గ్రహించారు.
ముంబయి మరియు బెంగుళూరులోని ప్రకటనల ప్రపంచంలో తన కళాత్మకతను ప్రదర్శించి తన ముద్రను దృడంగా వేసి, మన్ననలను పొందారు ఇక్బాల్ గారు,జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచారు. నిజానికి ప్రతీరోజు, ఆసక్తిగల ఫోటోగ్రాఫర్ లు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇక్బాల్ గారి స్టూడియో కి వచ్చిపోతుండేవారు. వాళ్ళు అతనితో పంచుకున్న ఫలితాల వివరాలను బట్టి, భారతదేశంలో వృత్తిపరంగా ఉపయోగపడే ఫోటోగ్రఫీ ని నేర్పించే సంస్థ నిర్మించాల్సిన ఉందని గ్రహించారు.
అనురాధఇక్బాల్ గారి చురకైన సహకారంతో, 2001లో, మొట్టమొదటిసారిగా అన్ని సౌకర్యాలుగల Light & Life Academy స్థాపించబడింది.
ఈ గత 17 ఏళ్ళలో, Light & Life Academy ఎంతో మంచి సమర్ధవంతమైన ఫోటోగ్రాఫర్ లను తయారు చేసింది, వీళ్ళు తమదైన శైలిలో ఓ కొత్త కోణాన్ని సృష్టించి, పరిశ్రమలోనూ, జాతీయంగా, అంతర్జాతీయంగాను ఎన్నో ప్రశంసలు, సన్మానాలు పొందారు.
చూడండి www.llacademy.org & www.iqbalmohamed.com
ఇక్బాల్ మరియు అనురాధాగారు, భారతదేశంలోని ఆశాజనకమైన ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ లను అందుకోవాలన్న కలను కన్నారు. ఈ దిశలో జరిగిన మొదటి ప్రయత్నం పోర్ట్రైట్ & ఫంక్షన్ ఫోటోగ్రఫీ అన్న పుస్తకాన్ని ముద్రించడం, ఆంగ్లంలోనే కాకుండా ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఇది ముద్రించబడింది. ఎంతో ఆహ్లాదకరంగా దీనిని స్వీకరించిన చదవరులు, ఇటువంటి ఇంకెన్నో కావాలని ఆశపడ్డారు.
Light & Life Academy లో పొందిన జ్నానాన్ని, ఇప్పుడు అందుబాటులోనున్న సాంకేతిక అభివృద్ధినీ ఉపయోగించుకుని, ఫోటోగ్రఫీ లో మంచి నాణ్యతగల విద్యను అందించేసమయం ఆసన్నమైందని వారు భావించారు.
LLA ఆన్లైన్ లో ప్రవేశించండి, ఏమాత్రం ఫోటోగ్రఫీ విద్య గురించిన అవగాహన లేని ప్రేక్షకులలో మమేకం కావడానికి మనస్పూర్తిగా మొదలైన ప్రక్రియను చవిచూడండి. ఈ ప్రోగ్రాం ని రూపొందించినవారు శ్రీ ఇక్బాల్ మొహమ్మద్, ఫోటోగ్రఫీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే, ఆతృతగల గొప్ప వ్యక్తి.
ఈ LLA ఆన్లైన్ ప్రోగ్రాం లోని మరో ప్రత్యేకత, దీనికి LLA పూర్వ విద్యార్థులు. అందించిన ఆహ్లాదభరితమైన సహకారం. ఈ ప్రోగ్రాం ని మొదలు పెట్టడమే కాకుండా, ఇందులో పాల్గొనేవారికి మార్గదర్శకులై, విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికి తేవడానికి తమ అనుభవాలను అందిస్తారు.
ఒక వేదికను అందించడం LLA ధ్యేయం, అంతేకాక, తమలోని కళాత్మకతను అన్వేషించి, పెంపొందించుకుని ప్రదర్శించుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ LLA ఆన్లైన్ ప్రోగ్రాం లోని మరో ప్రత్యేకత, దీనికి LLA పూర్వ విద్యార్థులు. అందించిన ఆహ్లాదభరితమైన సహకారం. ఈ ప్రోగ్రాం ని మొదలు పెట్టడమే కాకుండా, ఇందులో పాల్గొనేవారికి మార్గదర్శకులై, విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికి తేవడానికి తమ అనుభవాలను అందిస్తారు.
ఒక వేదికను అందించడం LLA ధ్యేయం, అంతేకాక, తమలోని కళాత్మకతను అన్వేషించి, పెంపొందించుకుని ప్రదర్శించుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం.
ఇక్బాల్ మొహమ్మద్
ఇక్బాల్ మొహమ్మద్
ఇక్బాల్ మొహమ్మద్ గారు భారతదేశంలోని ప్రముఖ ప్రకటనల ఫోటోగ్రాఫర్ . Brooks Institute పూర్వ విద్యార్థి అయిన ఈయన చెన్నైలోని Loyola కాలేజ్లో B.A.History &Political సైన్స్) చేశారు. University of Madras లో MBA పూర్తి చేశారు. తన ఫోటోగ్రాఫర్ వృత్తిలో ఆయన ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఖాతాదారులకు ఎన్నో campaign చేశారు.వాటిలో Ford, Toyota, FIAT, Taj Group of Hotels, కలర్ Plus, Ponds, TVS, Timex, Reebok, GE, BPL, Coca Cola, Ashok Leyland, Cairn India, Tamil Nadu Tourism లాంటివి ఉన్నాయి. ప్రభత్వం, స్వచ్ఛంద సంస్థల కోసం ఈయన ఎన్నో సామాజిక అవగాహన కలిగించే కాంపెయిన్స్ కు కూడా పనిచేశారు.
ఆంగ్లంలోనే కాకుండా, 8 ప్రాంతీయ భాషలలోనూ ముద్రించబడిన ఇక్బాల్ మొహమ్మద్ గారి పోర్ట్రైట్ & ఫంక్షన్ ఫోటోగ్రఫీ అన్న పుస్తకం ఫోటోగ్రఫీ విద్యను బడుకు వర్గానికి కూడా అందించింది. ఇది మార్గదర్శకమైనది. తంజావూరులోని ఆలయానికి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా వారు ప్రచురించిన "Vibrant at 1000" అనే పుస్తకం ఎంతో మన్ననలు పొందింది. ప్రపంచ సాంప్రదాయాన్ని చాటే విధంగా UNESCO కోసం ఆయన "the Nilgiris Mountain Railway" మరియు "Chola ఆర్కిటెక్చర్" అన్న పుస్తకాల కోసం చిత్రీకరణ చేశారు. ఇక్బాల్ గారి చిత్రాలు ఫోటోగ్రఫీ పరిశ్రమలో ఆయనకు, ఎంతో పేరు ప్రఖ్యాతులను, ఎన్నో సన్మానాలను దక్కించాయి.
ఫోటోగ్రఫీ విద్యకు ఆయన చేసిన సహకారం ఎన్నో ప్రశంసలను అందుకుంది. భావ ప్రకటన, కళాత్మకతను ప్రదర్శించడానికి ఎక్కువ మంది ఫోటోగ్రఫీ ని ఎంచుకునేలా చేయాలనేది వారి ధ్యేయం.
అనురాధ ఇక్బాల్
అనురాధ ఇక్బాల్
LLA ఆన్లైన్ వెనకున్న సృజనాత్మక శక్తి ఇక్బాల్. అయితే ప్రణాళికలు వేయడం, వాటిని అమలు పరచడం అనురాధ గారి పని, వ్యాపారం మరియు ప్రకటనలలో నైపుణ్యం గల వీరికి ఒక దశాబ్దకాలం అనుభవం ఉంది. ప్రణాళిక, కార్యాచరణలో వీరు జాతీయ, అంతర్జాతీయ మన్ననలు పొందిన వీరు Light & Life Academy యొక్క సహ స్థాపకురాలు. వీరు కామర్స్ లో గ్రాడ్యుఎట్, ఎకనామిక్స్ లో పోస్టుగ్రాడ్యుఎట్, ముంబయి విశ్వవిద్యాలయ లో చేశారు. వ్యాపార రంగంలోనూ మరియు ప్రకటనా రంగంలోనూ ఆమె డిప్లొమా చేశారు. ఎన్నో కార్యనిర్వహణ తర్ఫీదు శిక్షణలలో పాల్గొన్నారు. మన దేశంలో అలాగే ఇతర దేశాల్లో కూడా అనూరాధగారు పర్యావరణ సంరక్షణ, మరియు సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాల్లో ఎంతో అంకితభావంతో పాల్గొంటున్నారు. పిల్లలను వారి జీవితాలను కళ ద్వారా స్పృశించి పెంపొందించాలన్నదే వారి చిరకాల వాంఛ.
ప్రహ్లద్ మురళీధరన్
ప్రహ్లద్ మురళీధరన్
మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఒక రీతిగా ఎందుకు ప్రవర్తిస్తారు. సమాజాన్ని నడిపించేది ఏది, విభేదాలను కలిగించేది ఏధి, మనుషుల్ని కలిపేది ఏమిటి, విడదీసేదేమిటి? ఈ ప్రశ్నలు ప్రహ్లాద్ ను ఎంతో అలరించాయి. అందుకే ఆయన మనో వైజ్ఞానిక శాస్త్రం చదువుకున్నారు. వ్యక్తుల్ని పరిశీలించేందుకు, ఆయన పలు జాతులను పరిశీలించారు. సామాజిక సేవలో ఆయన పోస్ట్ గ్రాడ్యుఏషన్ చేశారు. మెడికల్ సైకియాట్రీ ని ముఖ్య పాఠంగా తీసుకున్నారు. ప్రజలను సామరస్యంగా ఏకం చేయడం ఎలా అనేది ఆయన ధ్యేయంగా మారింది.
ఇక్బాల్గారితో ఎక్కువ సమయం గడపడం వల్ల లభించిన అనుభవంతో, పలువురు ఫోటోగ్రాఫర్ లు మార్గదర్శకం చేయడం వల్ల, పిల్లలు, మరియు కాలేజీ విద్యార్థుల కోసం ఇక్బాల్గారితో కలిసి ఫోటోగ్రఫీ వర్కషాప్స్ లో సహకరించడం వల్లా, చిత్రం ద్వారా ఎలాంటి అవరోధాలైనా దాటచ్చని, అది విశ్వభాషని దానిని అపార్థం చేసుకునే అవకాశమే లేదని గ్రహించారు.
ఈ విషయం. ప్రహ్లాద్, ఇక్బాల్ మొహమ్మద్ మరియు అనురాధగారితో చేతులు కలిపేలా చేసింది. ప్రజలు తమ భావాలను ఎలా వ్యక్తం చేయాలో తెలుసుకోడానికి, అందరి మనో భావాలనూ స్పందించజేసే కళ ద్వారా ప్రజలను ఎలా కలపాలో తెలుసుకుని ఆచరించేలా చేసింది.
LLA ఆన్లైన్ ఫోటోగ్రఫీ విద్య కార్యక్రమం ఈ లక్ష్యాలను గ్రహించటానికి సహాయం చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ LLA ఆన్లైన్ ఫోటోగ్రఫీ విద్యా కార్యక్రమం సాధిస్తుందని ఆశిస్తున్నాం.
వంటి, Light & Life Academy’ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ప్రోగ్రాంలాగ, భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 8 భాషల్లో ముద్రించబడ్డ పోర్ట్రైట్ & ఫంక్షన్ ఫోటోగ్రఫీ పుస్తకంలాగ, ఈ LLA ఆన్లైన్ ఫోటోగ్రఫీ ప్రోగ్రాం కూడా, ఒక మార్గదర్శకమైన ప్రయత్నమే.