LLA ఆన్లైన్ ప్రోగ్రాంపై ప్రతి గురువు వృత్తిపరమైన ఫోటోగ్రఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో Light & Life Academy నుండి పట్టభద్రుడయ్యాడు, అది చాలా కఠినమైన శిక్షణను అందిస్తుంది. వారు ప్రస్తుతం భారతదేశం అంతటా వారి కళను అభ్యసిస్తున్నారు మరియు విభిన్న నేపథ్యాలు మరియు సంస్కృతుల నుండి వచ్చి, సౌందర్య సున్నితమైన దృశ్యాలను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ LLA వద్ద అదే సాంకేతిక మరియు కళాత్మక శిక్షణ నుండి గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఇచ్చే అభిప్రాయ పరంగా స్థిరత్వం ఉంటుంది.
S.N Ajit
Ajit S.N Multinational Retail Company లో పనిచేసారు. వారికి వారి ఉద్యోగం ఇష్టమే అయినా, rig ల మీద, గాడ్జెట్ ల మీద, కారు లు మరియు బైక్ ల పోస్టర్ ల మీద, అతనికున్న చిన్నానాటి ఆశ, అతణ్ణి చిత్రం వైపు తీసుకొచ్చింది. ఎంతో పరిశోధించిన తరువాత, LLA లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.
అంతా హటాత్తుగానే జరిగింది Ajit కి, తన కార్పొరేట్ ప్రపంచం నుండి బయటపడి ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలన్న నిర్ణయం కూడా అలానే జరిగింది. తన చేతల వల్ల యాదృచ్చికంగానే జరిగింది. ఈత గురించి ఏమీ తెలీకుండానే ఆయన మొదటిసారి diving కి వెళ్ళినప్పుడు ఎంతో ఆకర్షితులైయ్యారు, వెంటనే underwater ఫోటోగ్రఫీ పరికరాలు తీస్కుని ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఎంతో సమయం గడిపారు. ఇప్పుడు ఆయన ఓ certified diver. జలగర్భ జీవనం గురించి ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ చిత్రం లు తీస్తున్నారు. తన జలగర్భ చిత్రం ల సేకరణను ఓ ప్రదర్శనగా ఇవ్వాలన్నది అతని కోరిక.
ఆయన నేలమీద ఉన్నప్పుడు ఆటోమొబైల్ మరియు జీవనశైలి చిత్రం లు తీయడం అతనికి అలవాటు. Ajit గారు LLA కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. తనకున్న ఆసక్తి LLA లోనే మెరుగుపడింది. లో తప్పొప్పులు తెలపడం, విద్యను వ్యాపింపజేయడం అతని లక్ష్యం. అతని దృష్టిలో LLA ఆన్లైన్ వేదిక విద్యార్ధుల దగ్గర, మార్గదర్శకుల దగ్గర ఒకే రకంగా ఇచ్చి, పుచ్చుకునే వ్యవహారమే. తన నుండి విద్యార్ధులు నేర్చుకున్నట్టే, విద్యార్ధుల నుండి తానూ నేర్చుకోవాలంటారు ఆయన.
Akshay Sharma
Akshay Sharma భారతదేశం లోని New Delhi కి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ . కార్పొరేట్ కంపెనీ లలో, అయిదేళ్లపాటు, నిర్వహణ కన్సల్టింగ్, మార్కెటింగ్ ప్రకటనలు, లాంటి పలు విధాల ఉద్యోగాలు చేసినవారు. 2015 లో, ఒక సంవత్సరం నడిచే ఓ ప్రోగ్రాంని చేయడానికి Akshay, Light & Life Academy కి వెళ్ళారు.
సంపాదించడానికి, ఆయన బ్రాండ్ విలువగల జీవనశైలిని చూసే స్థలాలను అంటే (ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ & అంతర్గత, లగ్జరీ స్టిల్-లైఫ్) లాంటి వాటిని బ్రాండ్ కధను చెప్పేలా చిత్రీకరిస్తారు, వ్యక్తిగతంగా, అర్చిటెక్చరల్ నిర్మాణాలను చిత్రీకరించడం, ఎగిరే క్షణాలు, అందమైన అంతరిక్షం మరియు అందాల రూపకల్పన లను సేకరించడం అతనికి ఇష్టం.
Akshay పర్యావరణ సంఘటలను, వైజ్ఞానిక, సాంకేతిక ఆవిష్కరణలనూ, మానవ హక్కులూ మరియూ వ్యక్తిగత స్వేచ్ఛనూ క్షుణ్ణంగా గమనిస్తారు. వీటికి కారణం అతనికి, వేదాంతం, మనో విజ్ఞానశాస్త్రం, ప్రకృతి, స్వతంత్ర కళ, సంగీతాల మీదున్న ఆసక్తే.
LLA ఆన్లైన్ లో మార్గదర్శిగా ఉంటున్న అక్షయ్, తన యావజ్జీవ కోరికైన, శిక్షణ, క్రమబద్ధమైన తర్ఫీదుకు ఎంతగానో దోహద పడుతున్నారు. లో ప్రజా స్వామ్యత్వాన్ని నింపే ఈ లో భాగం కావడం ఆయనకు ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. భావ ప్రకటనలోనూ, విచారణ లోనూ ఇక్కడ హద్దులు లేవు.
Akshaya Vaidhyanathan
తమ ఉద్యోగాలు చేస్కుంటూ, తాము ఆశపడి విషయాలను సాధించుకునే కుటుంబానికి చెందిన Akshaya కు కూడా, స్ఫూర్తి ఎటువంటి లోపమూ లేదు. H.R గా పని చేసే వారి నాన్నగారు ఒక గొప్ప నటుడుకూడా. తన తండ్రిని సంతోష పరిచేది నటనని తెలుసుకున్న Akshaya అతని పుస్తకం నుండి ఒక పంక్తి ఆసరాగా తీస్కుని సినిమాటోగ్రఫీ లోనూ మరియు ఫోటోగ్రఫీ లోనూ తన ఆసక్తిని చూపించారు. ఎలక్ట్రానిక్ మీడియా లో ఆమె degree పూర్తి చేసారు. ఆమె పుస్తకాల పురుగు కాదు, స్వయంగా చేసి చూడాలనుకునే రకం. కాలేజీ రెండో ఏట ఆమెకు ఫోటోగ్రఫీ పరిచయమైంది. ఆ తరువాత వెనుదిరగలేదు. ఆమె సినిమాటోగ్రఫీ అభిమాని, మనుషుల జీవితాలలోని ముఖ్య ఘట్టాలను సహజంగా కాప్చర్ చేయడమంటే ఆమెకు అమితమైన ప్రీతి, అదే ఆమె ఫోటోగ్రఫీ ని వృత్తిగా తీస్కోడానికి దోహదపడింది. Akshaya కు ఫోటోగ్రఫీ అన్నది అభిరుచి కానేకాదు. తాను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలనే కోరుకుంది.
LLA లో ప్రొఫెషనల్ లో post-graduation పూర్తి చేశాక, తన కళను ఇప్పుడు చెన్నైలో కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆహార & ఫ్యాషన్ మీద దృష్టి సారించారు. తన ఫ్యాషన్ ద్వారా, మనుషుల్ని కలపడానికి, వాళ్ళ మధ్య కొన్ని సందేశాలను, కధలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. తనకున్న ఆహార ప్రీతి వల్లే ఆమె ఫుడ్ ఫోటోగ్రఫీ కి దగ్గరైయారు.
ఫోటోగ్రఫీ వల్ల కొత్త జీవితం లభించిందని, కొత్త దారి దొరికిందని, ప్రతీ రోజు ఉత్సాహ భరితంగా ఉంటోందని Akshaya అంటున్నారు. ఇంత వరకు ఎన్నడు అబ్బా ఈరోజు పనికి వెళ్ళాలా దేవుడా అని ఆమె తలచిందిలేదు. వీలైనంత మందితో తన లోకాన్ని మార్చేసిన ఈ కళా రూపాన్ని పంచుకోవాలన్న దృక్పధమే ఆమెను LLA ఆన్లైన్ లో పాల్గొనేలా చేసింది.
Ankit Gupta
Ankit Gupta, డిల్లీలో పెరిగారు. క్రికెట్ అంటే పిచ్చి, అవకాశం దొరికినప్పుడల్లా ఆడేవారు, టేబుల్ -టెన్నిస్, బాడ్మింటన్ అన్నా ఆయనకు ఎంతో ఇష్టం. తను చుట్టూ ఉన్న వారిలాగే, పాఠశాల అయ్యాక, Ankit కి ఎంచుకునేందుకు రెండు దారులు కనిపించాయి. ఇంజనీర్ అవ్వడం లేదా doctor కావడం. తను మొదటి దాన్ని ఎంచుకొని ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసారు. కాలేజీ నుండే తిన్నగా Infosys లో ఉద్యోగం రావడంతో మైసూర్ కి వచ్చి స్థిరపడ్డారు. Mysore కి బయలుదేరే ముందు వాళ్ళ అమ్మగారు ఆయనకు ఓ DSLR బహుకరించారు. అదే Ankit కి ప్రారంభం. విదేశాలలో MBA పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాలుగేళ్ళపాటు Infosys లో పని చేశారు.
కానీ ఆయన అద్దెకున్న ఇంటి యజమానురాలితో జరిగిన సంభాషణ Ankit లక్ష్యాన్ని మార్చేసింది. ఆమె ఒక ముదసలి, తన పిల్లలందరూ విదేశాలలో ఉంటున్నారు. Ankit కూడా అదే దారిలో వెళ్తున్నారు. కాబట్టి, వాళ్ళు ఆమెను చూడ్డానికి ఎన్నిసార్లు వస్తుంటారని కనుక్కున్నారు. ఆఖరిగా వాళ్ళు అయిదేళ్ళ క్రితం వచ్చారని ఆమె చెప్పగానే, Ankit పధకాలన్నీ పూర్తిగా మారిపోయాయి, India లోనే తన కుటుంబానికి దగ్గరగా వుండాలని నిర్ణయిoచుకున్నారు. Infosys ని వదిలి డిల్లీ కి వెళ్ళారు. తండ్రిగారి వ్యాపారంలో పాలు పంచుకోవడం అసాధ్యమని తెలిసి, మీద మొగ్గు చూపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు తను తీసిన చిత్రం లను చూసి తరచూ పొగడడం అతనికి ప్రేరేపణను అందించింది. తన జ్ఞాపకాలలో నిలిచిపోయిన ఓ ఉదయం గురించి చెప్తూ, ఆ రోజు ఆయన కాశ్మీర్ లోని ఒక లోయలో ఉన్నప్పుడు, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ఆయనకు ఆ ప్రకృతి దృశ్యాన్ని అలాగే కాప్చర్ చేసి, శాశ్వతంగా అనంతంలో నిలపాలనిపించిందని అన్నారు.
కొంత వాగ్వివాదం తరువాత, మూటాముల్లె సర్దుకుని, తిన్నగా LLA కు వచ్చి, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లో Post Graduation పూర్తి చేశారు. ప్రయాణ, ప్రకృతి, ఆర్కిటెక్చర్ మరియు అంతర్గత ఫోటోగ్రఫీ అతని ప్రత్యేకతలు.
సమాజానికి ఏదైనా చేయాలన్నది అతని ప్రధమ ధ్యేయం. ఫోటోగ్రఫీ మీద ఎంతో ఆశాజనకంగా వుండే వారితో తన ఫోటోగ్రఫీ పరిజ్ఞానాన్ని పంచుకునే వేదికను LLA ఆన్లైన్ అతనికి అందించింది.
Arnab ఫోటోగ్రఫీ ని ఎంచుకోడానికి ప్రేరణగా నిలిచింది, ఫోటోగ్రాఫర్ అయిన వారి నాన్నగారే. చిన్నతనంలో, పలు రకాల పరికరాలతో వాళ్ళ నాన్నగారు ప్రయోగాలు చేయడం చూశారు. వారు జమ్షద్పూర్ లో ఓ lab ను స్థాపించారు. ప్రదర్శనలకు కావలసిన ముద్రణ చిత్రం ల ఖాoడాగారం ఆ ఊరు. ఫోటోగ్రఫీ లోని ప్రముఖుల్ని కలిసే అవకాశo Arnab కు ఇక్కడ లభించింది.
ఇక్కడ మూడవ తరగతి నుండే చిత్రం లు తీయడం మొదలు పెట్టిన Arnab, ఇంటి function ల ఫోటోగ్రాఫర్ గా మారారు.
Pune లోని Ferguson కాలేజ్ లో, BA సైన్స్ చేసారు. Arnab. Mass communication మరియు భౌతిక ను ప్రత్యేక పాఠాలుగా తీస్కున్నారు. అప్పుడు ఆ కోర్స్ లలోనే ఫోటోగ్రఫీ కి సంబంధించిన చదువు ఉండేది. ఇది అతని జీవితంలో పెద్ద మలుపుగా మారింది, ఆకర్షణీయమైన ఫోటోగ్రఫీ అతని జీవిత ధ్యేయంగా మారింది. ఇక దానినే కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
Arnab LLA లో చేరి, తన Post Graduation Diploma ను 2003 లో పూర్తి చేసాం. అతను ఎక్కువగా, వస్తువులు, ఆటోమొబైల్ మరియు పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ చేస్తారు. 2008 నుండి వారు LLA లో అధ్యాపకులుగా వుంటున్నారు. ఒక ఫోటోగ్రాఫర్ గా పరిణామ అభివృద్ధి చెందేందుకు ఆయన వ్యక్తిగత ప్రాజెక్ట్ లను చేస్తుంటారు, దానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. అందులోని భాగంగా, దక్షిణ ఆఫ్రికా పర్యాటక వ్యవస్థ కోసం చేసిన షూట్ కుంభమేళా దృస్యరూపాoతరం, మధుర లో జరిగిన హూలి వేడుకలు, మరియూ పుష్కర జాతరే కవరేజ్.
ఫోటోగ్రఫీ ని ఒక కళారూపంగా ప్రజలు చూడాలని Arnab కోరుకుంటున్నారు. మన దేశంలో ఫోటోగ్రఫీ వృద్ధికి ఇది అవసరం. పలు ప్రాంతీయ భాషలలో అందుతున్న LLA ఆన్లైన్ ప్రోగ్రామ్ ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఫోటోగ్రఫీ విద్యను దేశవ్యాప్తంగా చాటాలని Arnab ఆకాంక్షిస్తున్నారు, అందుచేతనే LLA ఆన్లైన్ లో మార్గదర్శకులైయారు.
Garima Chaudhary
ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు Garima కళల్లో ఆసక్తి కలిగింది. అప్పటి నుండి ఎంతో భాద్యతాయుతంగా భారతదేశంలోని కళారంగ కళాశాలల గురించి ఆమె తీవ్రంగా పరిశోధన చేసింది. పన్నెండో తరగతి పరీక్షల తరువాత, పౌర సేవలు దారంట చరిత్రను చదవసాగింది. ఆమె బాగా చదివింది కానీ ఏవో కొరతున్నట్టు భావించింది. మంచి మార్కులు ఆమెను సంతోషపెట్టలేదు. ఇంకేదో కావాలని ఆమె కోరుకుంది. తరువాత, తన తల్లితండ్రులకు తెలియకుండా కళల కోర్స్ లో ఎంపిక అయింది. తన కన్నవాళ్ళను ఒప్పించి ఆ కోర్స్ లో చేరింది, అక్కడే మొదటిసారిగా తో పరిచయం అయింది. చేతిలో Vivitar కెమెరా తో ఫోటోగ్రాఫర్ గా తన ప్రయాణం మొదలైంది.
తను ఓ విష్వలైజర్ గా పని చేస్తూ, Digital Media, లో Post graduation చేసింది, అందులో అనిమేషన్ ప్రత్యేకంగా తీస్కుంది. తరచూ కన్నవారితో వివాదిస్తూ, తనకు కళల మీదున్న ఆసక్తి తనకు మంచి వృత్తిని, నిలకడైన ఆదాయాన్ని అందిస్తుందని వారిని ఒప్పించింది.
తన సృజనాత్మకతతో, నైపుణ్యాలతో తన భర్తను మెప్పించి, ఒక DSLR బహుమతిగా పొందింది. తరువాత LLA కు దరఖాస్తు చేసి ప్రొఫెషనల్ లో Post graduation పూర్తి చేసింది.
2011 లో వచ్చిన E-commerce మీద Garima స్వారీ చేసింది. పలు e-commerce site లకు ఫోటోగ్రఫీ అసైన్మెంట్ లు చేసి అందులో ఔనత్యాన్ని సాధించింది. 2011 లో తన మొదటి స్టూడియో ను నిర్మించి, అందరికీ పనులు చేసి పెట్టింది, తన కళా పరిజ్ఞాన్నాన్ని, ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని మిళితం చేసి తనదైన ప్రత్యేకమైన శైలి సృష్టించింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో స్థిరపడింది. ఆర్ట్ డైరెక్టర్ గా, గ్రాఫిక్ రూపకల్పన గా, చిత్రకారుడు గా, ఫోటోగ్రాఫర్ గా మరియు బ్లాగర్ గా ఉంటోంది.
సామాన్య ప్రజలకు తగిన కళారూపం ఫోటోగ్రఫీ అని Garima దృడoగా నమ్ముతున్నారు. పలు ప్రాంతీయ భాషల ద్వారా LLA ఆన్లైన్ సామాన్య ప్రజలను చేరుకోవాలని చేసిన ప్రయత్నం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. LLA ఆన్లైన్ గురించి మాలాగే ఆమె కూడా సంతోషిస్తున్నారు.
Kavitha Swaminathan
Coming from an influential and well to do family in Tirupur, Kavita breezed through school with a handsome amount of pocket money every week. Early on, she realised that she was extremely passionate about one thing- Chocolates. This has been her most longstanding passion. Till date, Kavita can eat a whole bar of chocolates in seconds, while simultaneously looking for the next piece of chocolate. In school, she paid attention and did well only in the subjects she likes – Physics, Zoology and Botany, with an aim of becoming a Doctor. One week into her doctorate programme in college, she decided that she couldn’t complete the course and quit. She then tried to apply for a B. Com course but it was too late and all the colleges had completed their admission procedure. Kavita says that looking back now, this was a blessing in disguise. After little choice, she joined the visual communication course at the Maharaja college, Perundurai. Armed with a Pentax K 100, a dark room and the freedom to explore the nooks and corners of her mind, Kavita realized the power of photography. In this college with over 1500 people, the six Visual communication students were sought after the most. After all, who doesn’t want a good picture of themselves? Photography lightened up all her senses, says Kavita. While taking pictures, she could empathise with the dog’s pain, feel the breeze brush against her and was awestruck by the colours of the flowers and the sky. The world around her transformed into a vastness of unlimited beauty, the pieces began to fall into place and finally, the world started to make sense, through photography., Kavita knew then, that she was going to be a photographer the rest of her life.
She studied in LLA back in 2002, where she was convinced that every day was a revelation. Even after the course, she always knew that she needed to grow as a photographer every time she looked at the work of another professional photographer. She came to understand that she will be a student for life, striving to quench her constant thirst for knowledge and her need to evolve as a photographer. She now works full-time at Light & Life Academy, monitoring the academic standards in college, while also chasing the light as she captures people, places and memories in Ooty. She continues to learn every day from the students while simultaneously imparting her in-depth knowledge of the subject. The excitement of meeting new creative minds looking to explore the depths of photography gives her immense satisfaction. LLAOnline, she says, is particularly dear to her because it will be available in nine different Indian languages, which will help a number of aspiring photographers get inspired to learn photography
Khushboo Agarwal
నా జ్ఞాపకాలను నమర వేసుకుంటే, తానూ పుట్టి పెరిగి,అనకు అలవాటైన కలకత్తాను విడిచి, చెన్నైలో వ్యాపారం స్థాపించిన మా నాన్నగారి ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. ఆ రకంగా నాకు రెండు ప్రపంచల ప్రత్యేకతలు లభించాయి, లోతుగా పాతుకు పోయిన ఉత్తర భారత సాంప్రదాయాలు, అదే సమయాన తమిళ ప్రజలతో మంచి స్నేహం, ఆ మనుషులు, వారి ఆహరం, వారి సాంప్రదాయాలు. ఈ చోటు ఇవన్ని గొప్ప విషయాలే. విభిన్నత్వం జీవిటానికి పోపు లాంటిదంతారుగా.
పాఠశాల లో,ఎన్నో రకాల కార్యకలాపాలలో పాల్గొన్నాను.అంటే, నాట్యం, నాటకం, వివాద చర్చలు కానీ పాత మాత్రం రాలేదనుకోండి.ఎలాగోలా పాఠశాల గాన బృందంలో చేరాను, కానీ చదువులో తరగతి 1st రావాలన్నదే నా ప్రధాన ఆశయం.పదవ తరగతి ఫలితాలు ప్రకటించాక, నేను అయిదవ స్థానాన్ని పొందడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.అన్నిటినీ మార్చేసింది.
నా ఆత్మనాలం బాగా దెబ్బతింది.జరిగిన పొరపాటును సరిదిద్దుకునే కాలమది.తర్వాత రెండేళ్లపాటు ఏమీ చేయకుండా గడిపేసాను, కానీ నాట్యం మీద నాకున్న మోజువల్ల దాన్ని కొనసాగించాను, అదృష్టం ఏంటంటే అందులో నాకు బహుమతులు రావడం, అందరు నన్ను నర్తకిగా అంగీకరించడం. భరతనాట్యం,కధక్,
Ghooomar లాంటి నాత్యకళలు నేర్చుకున్నాను. తరువాత, Jive, Salsa, Bhachatha కూడా నేర్చుకున్నాను.జీవితం మెరుగుపడడం మొదలైంది.చదువు సంధ్యలు నాకు అబ్బవని తెలిసిపోయింది.నేను visual communication ని , ఎంచుకున్నాను, దాని ద్వారా ఫోటోగ్రఫీ ని తెలుసుకున్నానుదానితో నా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. కొత్త ప్రపంచం అనుసంధానం కుదుర్చుకోడానికి
ఫోటోగ్రఫీ అవకాశాన్ని అందించింది. ఎంతో సౌకర్యమైన విషయాల నుండి, సాధారణమైన విషయాల వరకు, ప్రాకృతిక విషయాల నుండి, కృత్రిమ విషయాల దాకా ఈ వైవిద్యం నాకు మత్తేక్కించింది. అప్పుడే Light & Life Academy కనిపించింది.అక్కడ నేను గడిపిన ప్రతీ క్షణాన్ని ఆనందంగా అనుభవించాను.
ఈనాటికీ, నేను వైవిద్యాన్నే వెంతాడుతాను. నా వృత్తి ఫోటోగ్రఫీ అయినా, నాట్యం చేయడానికి, నేర్పడానికి నేను సమయం కేటాయిస్తుంటాను. కొంత కాలం తరువాత సినిమాటోగ్రఫీ ని అన్వేషించి, నాటకాలలో ఏదైనా చేయాలనుకుంటున్నాను
ఇప్పుడుLLAఆన్లైన్ ద్వారా, నా ఫోటోగ్రఫీ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుని, వారిలోని కళాత్మక శక్తిని వెలికి తెచ్చే ఓ అద్భుతమైన అవకాశం నాకు లభించింది.నాలోని సంతోషం ఉప్పొంగుతోంది
Mihir Hardikar
నా దారంట నన్ను వదిలేసుంటే, నేను షూ రూపకల్పన నేర్చుకునే వాడ్ని, ఎందుకంటే ఎప్పుడు మా బావ గదిలోని computer ముందు కూర్చుని shoe designing ఎలా చేస్తారని పరిశోధన చేస్తుండే వాడ్ని, అది నేర్చుకుని Nike company లో ఉద్యోగం సంపాదించేద్దామని, నేను షూ రూపకల్పన ని కావాలని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ ఇంకా నా స్నేహితులు తల్లితండ్రులు ఎగతాళి చేస్తూనే వుంటారు, వాళ్ళ ఉద్దేశంలో shoe రూపకల్పన చెప్పులు కుట్టడం ఒక్కటే.
పన్నెండో తరగతిలో, derivative, parabola గల గణిత శాస్త్రం కన్నా నాకు, మొక్కలూ, కప్పలూ, జీవశాస్త్రంలో ఏ మిన్న అని తెలుసుకున్నాను, అందుచేత commercial art ని ఎంచుకుని నేను JJ School of Art లో చేరాను. ముంబాయిలో! నాకు నచ్చినట్టు గీయొచ్చన్న ధీమాతో! ప్రతి రోజూ మా senior ల గోలవింటూ, అనిమేషన్, ఇల్లస్ట్రేషన్స్, ఎక్సహిబిటన్, డిస్ప్లే. ఫోటోగ్రఫీ లో ఎన్నో అవకాశాలున్నాయని నేను తెలుసుకున్నాను. ఆలోచనలకన్నా కార్యాచరణలోనే నాకు ఎక్కువ ఆసక్తి వుందని నాకు నేనే తెలుసుకున్నాను.
LLA నా కళ్ళు తెరిపించింది. వదులుకోవడం, నేర్చుకోవడం ఒకేసారి జరిగాయి. నాకు అందిన అసైన్మెంట్ అన్నిటిలోనూ నేను నా ప్రయత్నం చేసాను. తరచుగా వంట చేయడం మొదలు పెట్టాను, కలర్ తో ప్రయోగాలు చేయడం, టెషర్ లతో వేసే వస్తువుల తాజాదనంతో కొన్నాళ్ళకు నాకు ఆహారమంటే, పానియాలంటే వాటి అంటే ఇష్టమని తెలుసుకున్నాను.
స్థానికంగా ప్రయాణిస్తూ నేను ఆహారానికి సంబంధించిన వ్యక్తిగత ప్రాజెక్ట్ లను మెల్లగా ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి ప్రాజెక్ట్ లలో నాకు లాండ్స్కేప్, పోర్ట్రైట్స్, స్టిల్-లైఫ్ & ఫుడ్ ఆహారం ఫోటోగ్రఫీ తో వున్న పరిజ్ఞానం ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష.
ఎన్నోసార్లు, కళాకారులు భాష వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ప్రాంతీయ భాషలలో అందించబడే ఈ LLA ఆన్లైన్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో నేనూ పాలు పంచుకోవడం సంతోషంగా భావిస్తున్నాను.
Monika Adlakha
మాటలతో వచ్చిన సమస్య ఏంటంటే అందరూ మాట్లాడ్డం మొదలు పెట్టినప్పుడు, నిజానికి వాటిని వినడానికి ఎవరూ ఉండరు. మధ్యలోని ఆ చిన్న నిశ్శబ్దాన్ని నేను miss అయ్యాను. ఆ నిశ్శబ్దం మీకు గ్రహించే అవకాశమిస్తుంది. ఆలోచించనిస్తుంది. పంచుకోనిస్తుంది. చెప్పనిస్తుంది. ఆ చిన్న ఖాళీ నా కొత్త రూపంలో అంటే ఫోటోగ్రాఫర్గా నన్ను వివరిస్తుంది. నేను బాగా తింటాను, పరిశీలనగా అందరినీ గమనిస్తుంటాను, నేనో రచయిత్రిని, ఓ ఫోటోగ్రాఫర్ ని, ఓ బాటసారిని.
15 ఏళ్ళ వరకు నేను జీవితాన్ని మాటల్లో అభివర్ణించాను. కొన్నిసార్లు మీడియా వ్యక్తిగా, కొన్నిసార్లు వ్యాహ్యేళి నిపుణురాలిగా, అది అంతటితో చాలనుకుంటాను, అంతే కద. గమ్యం గల జీవితమే జీవితానికి గమ్యం. నాలోని ఈ అన్వేషణే, తేడాగా వున్న వాట్ని మెచ్చుకునేలా చేసింది. కళ్ళతో ఎలా అనుభవించాలో నేర్పింది, దాగున్న అందాన్ని ఆవిష్కరించడం, కాలంలో కొన్ని క్షణాలను స్తంభింపజేయడం నేర్పింది.
నాలోని బాటసారికి ధన్యవాదాలు చెప్పాలి, జీవితాన్ని స్థలాలకు, ముఖాలకు, అనంతంగా తీసుకువెళ్ళి, నేను కోరుకున్న దాన్ని చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది, జీవితాన్ని, పచ్చిగా, నీలంగా, ఇప్పుడుండేట్టు చిత్రీకరించడం నా ఆశ!
Light & Life Academy లో నాలో ఇమిడి పోయిన అనుభవం జీవితాంతం శాశ్వతంగా వుండి పోతుంది. నాతో పాటూ ఈ సవాలు, ఈ ఉత్సాహం, ఈ సాధన, ఈ ప్రయాణం అంతరించి పోకూడదనే నా ఆరాటం.
LLA తో నాకున్న ఈ పరిచయం, ఆలోచనలను కొనియాడేoదుకు, కొత్త విషయాలను ఊహించేందుకు, లోని విభిన్నమైన లోకాల గురించిన స్పూర్తిదాయకమైన వివాదాలకు ఇది నాంది కావాలన్నదే నా అభిమతం.
Light & Life Academy అన్నది ఒట్టి (అకాడమీ కాదు) విద్యా కేంద్రం కాదు. ఇది క్రమశిక్షణ. ఇక్కడ, అంతులేని లైట్ మరియు షాడో లు చేసే మాజిక్ ని చూసి ఆనందించి, నేర్చుకుని, ఉత్సుకతను పెంచుకునే వ్యక్తిగా మీరు మారుతారు. నన్ను ఇలా మార్చిన ఈ అకాడమీ తో సంబంధ బాంధవ్యాలు కలిగి వుండడం నాకు ఎంతో గర్వకారణం.
అందుచేత, మీ అభిరుచిని జీవించండి, మీ జీవిత లక్ష్యాన్ని కనుక్కోండి, నాతో చేతులు కలపండి.
Punya Arora
Punya Arora స్వభావరీత్యా ఓ పంజాబీ, కానీ మనోరీత్యా దక్షిణ భారతవాసి, ఒక ప్రొఫెషనల్ బిరియాణీ చేయడం సాటిలేని దిట్ట, మన దేశంలో ఎంతో అరుదైన స్టాండ్-అప్ కమిడియన్ లో ఒకరు, ఆమె.
తన హాస్య వైఖరి నిత్య జీవితం మీదా ప్రభావం చూపిస్తుంది. ఎన్నో హాస్య పూరితమైన క్షణాలను, పరిస్థితులను అందులో ఇముడ్చుకుని వుంటుంది.
తన శైలిలో, ప్రజలను చిత్రం లు తీయడం, భూమి మీద, నీటిలోని వాళ్ళను చిత్రీకరించడం పోర్ట్రైట్స్ మరియు ఫ్యాషన్ కాక, ఆమె స్థలాలను, ఆహారాన్ని, పెళ్లుల్ని కూడా చిత్రీకరిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆనందాన్ని, సంతోషాన్ని, సూర్యరశ్మిలా నలువైపులా వెదజల్లే ఓ నిరంతర పరిమళం ఆమె.
LLA ఆన్లైన్ లో ఆమె కూడా ఒక భాగమే, Punya తనకే సొంతమైన విషయాన్ని సాధిస్తుంది. తాను పొందిన వాట్ని తిరిగి లోకానికి ఇవ్వదు, ఫోటోగ్రఫీ మీద తనకున్న ఆసక్తిని వ్యాపింప జేయడం తన ధ్యేయం. నేర్పించడం అన్నదే ఓ గొప్ప నేర్చుకునే విధానమని punya ఎంతో దృడంగా నమ్ముతారు. LLA ఆన్లైన్ అన్నది విజ్ఞానాన్ని నలువైపులా వ్యాపింపజేసే ఉత్పేరకం లాంటిది.
Rejoy Krishna
సహజంగా దక్షిణ భారత మధ్య తరగతి కుటుంబాలలో ఇంజనీరింగ్ లేదా వైద్యం, చేయాలన్నది రాయబడని ఒక నిబంధన, కానీ నాకు ఆ ఆలోచనే ఉండేది కాదు. నాది ఒకే లక్ష్యం, కోయంబత్తూరులోని PSG Arts & సైన్స్ కాలేజ్లో మనస్తత్వశాస్త్రం చదవాలన్నది. నేను కాలేజీలో 2nd year చేస్తుండగా, VISCOM అన్న కోర్స్ మా కాలేజీలో ప్రవేశపెట్టారు. Viscom విద్యార్ధులతో మాట్లాడినప్పుడు, నాకు ప్రజలను అలరించడమంటే ఇష్టమని తెలిసింది. Radio Mirchi లో RJ గా చేరాను. కొద్ది కాలానికే ఎంతో పేరు పొందాను. ఏడేళ్ళ తరువాత ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అప్పుడు నాకు లో ఉన్న ఆసక్తిని అన్వేషిoచాను.
నేను విన్న విషయాలతో ప్రజలకు వినోదాన్ని అందించడానికి బదులు, నేను చూసే వాటితో ఆ పని చేయోచ్చనిపించింది.
ఫోటోగ్రఫీ ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. Light & Life Academy లో చదవాలని అనుకున్నాను, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలన్న నా కలను నిజం చేస్కొడానికి ఫోటోగ్రఫీ లోని అంశాలను, చిట్కాలనూ నేర్చుకున్నాను. పరిజ్ఞానాన్ని పొందడానికి వయసు నిమిత్తం కాదని LLA వారు ఎంతో చక్కగా నన్ను ప్రోత్సహించారు. నన్ను ఇలా మార్చిన, LLA వారి, సూచనలు, పరిజ్ఞానం మరియు ప్రోత్సాహానికి నేనెంతో రుణపడ్డాను.
ఇప్పుడు నేను, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్, ఆటోమొబైల్ మరియు ప్రయాణ ఫోటోగ్రాఫర్ కావాలన్న నా ఆశయాన్ని వెంటాడుతున్నాను. నేను నేర్చుకున్న దాన్ని ఇతరులతో పంచుకునే అవకాశాన్ని LLA ఆన్లైన్ నాకు అందిస్తోంది.
Sathish Kumar Raju
పలు తరాలుగా ఫోటోగ్రాఫర్ లున్న కుటుంబంలో పుట్టి పెరిగిన వారు sathish 1904 లో, వారి ముత్తాతగారు, పాండిచేరీ లో Omni చిత్రం స్టూడియో అని ఓ చిన్న స్టూడియో ని నిర్మించి, నడిపే వారట. తన చిన్ననాటి జ్ఞాపకాలలో బాగా గుర్తున్నది, వారి నాన్నగారు వాళ్ళ ఇంట్లో పెద్ద పరిమాణం ప్రింట్లు వేయడం. ఈ ప్రింట్లను రాత్రి పూట మేడమీద లేదా, ఇంటి మధ్యలో ఉండే పెద్ద చోటును ముట్రం అనేవారట అందులో వేసేవారంట. వాళ్ళ నాన్నమ్మగారు hypo ని కలిపి తన చేతుల్ని అందులో ముంచి దాని చల్లదనాన్ని ఆయనకు చవి చూపెవారట. అది ఇంకా ఆయనకు గుర్తుందట. వారి మొదటి ప్రింటు ఒక వ్యక్తి యొక్క నిలువెత్తు చిత్రం అట. ఆ చిత్రం మెల్లగా కనిపించినప్పుడు, అది మాజిక్ లాగ వాళ్ళ నాన్న మాoత్రికుడిలాగా అనిపించేదట. అప్పటినుండి Sathish ఫోటోగ్రఫీ తో కలిసిపోయారు.
చెన్నైలోని లయోలా కాలేజ్ లో BSc Visual Communication చేయడం అన్నది బుర్ర బద్దలు కొట్టుకునే నిర్ణయమేం కాదు, ని వృత్తిగా చేస్కోవాలనుకున్న sathish కి ఇది సహజమైన విషయం. LLA లో రెండేళ్లపాటు పనిచేస్తూ, ఇక్బాల్Mohammed గారి పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకున్నారు. అప్పుడు విద్యను పద్ధతి ప్రకారం నేర్చుకోవడం అవసరమని తెలుసుకుని, 2006 లో కోర్స్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కోర్స్ పూర్తయ్యాక, పలు షూట్ లో ఆయన సభకరించారు. తన క్షుణ్ణమైన పరిశీలనతో satish ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఫోటోగ్రాఫర్ గురించి మాత్రమే కాక, వివిధ సాంప్రదాయాల గురించి, ఆహారాలు, అలవాట్లు, ప్రజల గురించి తెలుసుకున్నారు. భారతదేశoలోని అత్యున్నత ఆటోమొబైల్ ఫోటోగ్రాఫర్ లలో అతను ఒకరు కావడానికి ఇవన్ని దోహదపడ్డాయి.
Sathish దృష్టిలో, సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన, మరింత మంది నేర్చుకునేలా చేయాలన్న తపన, ఆయన LLA ఆన్లైన్ లో మార్గదర్శకులు కావడానికి అతణ్ణి ప్రేరేపించింది. గురించిన పరిజ్ఞానం ఆన్లైన్ లో లభిస్తుంది కానీ, నిపుణులు సలహాలు వారి మార్గదర్శకం లేకపోవడడం పెద్ద లోటు. LLA ఆన్లైన్ ద్వారా ఆ లోటును తీర్చాలన్నదే వారి లక్ష్యం.
Shaheen Taha
మా నాన్నగారు ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావడం నా అదృష్టం. అందుచేత నాకు నాలుగేళ్ళప్పుడే నా చేతికి కెమెరా ఇచ్చారు. నేను ఫోటో లు తీయడం మొదలు పెట్టాను, ఆ తర్వాత ఆ పనే లేదు. నేను కాలేజ్ లో చేరినప్పుడు, ఇంజనీరింగ్ చదవడం అన్నది ఆనవాయితీ అయింది కాబట్టి నేనూ ఆ గుంపులో చేరిపోయాను. ఇంజనీరింగ్ చదువుతుండగా నేను చేసిన ఎంతో సరదా విషయం ఎన్నో కార్లకు టింకరింగ్ చేయడం, డ్రైవింగ్ చేయడం, దానితో అందరికీ పిచ్చేక్కించడం. నా మరో అభిరుచి సంగీతం. సైన్స్ నన్ను తినేయడం మొదలు పెట్టింది, అందువల్ల సృజనాత్మకమైన దారంట నన్ను వెళ్ళనివ్వమని మా నాన్నగార్ని అడిగి ఒప్పించాను. Wigan and Leigh కాలేజ్ లో నేను మూడేళ్ళ ప్రకటనలు మరియు రూపకల్పన డిగ్రీ చేశాను. ఆ సమయంలోనే నాకు మీదున్న మోజు పెరిగింది, Light & Life Academy దాకా తీస్కొచ్చింది. LLA నాకు ఎంత ప్రీకరమైనదో నేను మాటల్లో చెప్పలేను. LLA వల్లనే మీద నాకున్న దృక్పధం పూర్తిగా మారిపోయింది.
ఏ విధమైన ఫోటోగ్రఫీ అయినా నేను చేస్తాను. ఈ రోజు నేను ఎక్కువగా ఫ్యాషన్ , ఆర్కిటెక్చర్ & అంతర్గత ఫోటోగ్రఫీ మరియు మూవీ ప్రోమోలు చేస్తున్నాను. నేను ఆతృతగా ఎదురు చూస్తుందేంటంటే, పై స్థాయి ఆటోమొబైల్ ఫోటోగ్రఫీ చేయాలన్నదే, ప్రస్తుతం అందరూ కోరుకుంటున్న 3D రకం మాత్రం కాదు. ఎటువంటి సరిహద్దులూ అవసరం లేని ఒక ఆటోమొబైల్ చిత్రం ని నేను కాప్చర్ చేయాలనుకుంటున్నాను.
ఇతరులు చేసిన వాటిని చూడడం, ఆలోచనలను పంచుకోవడమంటే నాకు ఇష్టం. ఇది ఎప్పుడూ శిక్షణ అనుభవమే కాబట్టి నేను LLA ఆన్లైన్ ప్రోగ్రాం లో మార్గదర్శిని కావడంలో ఎంతో సంతోషపడుతున్నాను. ఎంతో మందికి భాష అన్నది ఒక పెద్ద అవరోధం. వాళ్ళలో గొప్ప నైపుణ్యం వుoటుoది, కానీ వారి మనసులోని మాటను వెలికి చెప్పలేరు, ఈ ప్రోగ్రాం ని తొమ్మిది ప్రాంతీయ భాషలలోఅందించడం ఓ అద్భుతమైన ఆలోచన. మరింత మంది ఈ LLA కుటుంబంలో సభ్యులు కాబోతున్నారంటే నాకెంతో ఆనందంగా వుంది.
Shantonobho Das
My introduction to photography happened through my father’s Olympus. The first time I held his camera and looked through the viewfinder it was extremely fascinating to me.
The pictures of the blue sky, vast oceans and clear raindrops looked even more beautiful through the lens of my camera. This strengthened my interest in Photography.
The other activity that really interested me in my childhood was helping my mother cook.
After school, I drifted into doing a degree in commerce but realised that expressing myself through images is what I really wanted to do. I took a break and travelled the world on a cruise ship just so I can capture images of varied subjects and places. End of the cruise I decided photography is what I wanted to do for the rest of my life, which led me to Light & Life Academy.
The practical sessions, demonstrations and assignments attracted me the most. Also, the trips I took while completing my assignments gave me a lot of opportunity to explore people and nature in the raw.
Today, even as I explore my photography I also indulge my liking for food. Experimenting with cooking and sharing it.
I have always believed in the fact that knowledge increases only when shared. LLA Online provides a vast platform for me to share what Mr. Iqbal and my other mentors have taught me.
Sukil Kumar
నా కుర్రతనంలో, మా కుటుంబ స్నేహితు అయినా ఓ పూజారిగారి జీవితాన్ని చూసి నేనెంతో ప్రభావితుడ్ని అయ్యాను. ఆయన తన Rajdoot లో ఊరంతా తిరిగేవారు, అతని చుటూ ఓ ధీమా, ఓ సాధన చేసిన హుందా పరిమళిస్తూ వుండేది. నేనూ అలా అవ్వాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. కానీ, పాఠశాల(St.Josephs) లో కొంత ప్రయత్నం తరువాత, ఇది నాకు తగినది కాదని తెలుసుకుని, చెన్నైలోని లయోలా కాలేజీలో చదవడం మొదలు పెట్టాను ప్రాంతీయ భాషలో పాఠశాల చదువులు చదివి, పెద్ద స్థాయి గల లయోలా కాలేజీలో చదవడం కొనసాగించడం నాలో అభద్రతను కలిగించింది. సైన్స్ లో నా మార్కులు బాగా రావడంతో నేను రసాయన శాస్త్రం తీస్కున్నాను కానీ, భాష ఓ’ అవరోధం కావడం వల్ల నేను class లకు వెళ్ళడం మానేసి ఇతర కేళికల్లో పాల్గొనడానికి ఎక్కువగా ప్రయత్నించే వాడ్ని. నాకు కళల్లో నైపుణ్యం సంపాదించడం మీద ఆసక్తి కలిగింది. అందువల్ల హాస్టల్స్ ని అలంకరిచడం, వివిధ విద్యార్ధుల కార్య క్రమాలకు పోస్టర్లు తయారు చేయడం చేసేవాడ్ని.
ఆ సమయంలోనే, ప్రపంచ సామాజిక ఫోరమ్ లో నేను చేరాను, అది అప్పడు చాలా పెద్ద విషయం. ఆ తరువాత Hyderabad లో కొందరు NGO లు ఆసియా సామాజిక ఫోరమ్ ని మొదలు పెట్టినప్పుడు, Father Henry గారు నాకు మొదటిసారిగా DSLR కెమెరా ను, నా rolls ని చేతిలో పెట్టి ఆ సంఘటనను చిత్రీకరించమని చెప్పారు. నాకు దాని గురించి ఏమీ తెలీదు. కానీ ఆయన పెట్టమన్నారు. ISO ని 100 లో వుంచమన్నారు. నేను అప్పుడు ఏదో సరిగ్గానే చేసినట్టున్నాను, వెంటనే Father Henry గారు నన్ను తన ఆధ్వర్యంలోకి తీస్కుని లయోలాలో Visual communication లో సీట్ వచ్చేలా చేసారు, కోర్స్ కి కావలసిన డబ్బు సంపాదించుకోడానికి, అప్పుడప్పుడు నాకు అసైన్మెంట్ లు ఇస్తూ నన్ను ప్రోత్సహించారు. అక్కడే నేను ఇక్బాల్గార్ని కలిసాను, LLA లో భాగం కావడానికి అoగీకరించాను.
నేను LLA లో పని చేస్తూ, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టాను.ఇక్బాల్గారితో సన్నిహితంగా పని చేయడం వల్ల, నాకు నచ్చిన పారిశ్రామిక ఫోటోగ్రఫీ మీద ఆసక్తి మరింత పెరిగింది. నాకు ఆహారాన్ని షూట్ చేయడం కూడా ఇష్టమే ఎందుకంటే నాకు తిండంటే చాలా ఇష్టం.
LLA ఆన్లైన్ ప్రోగ్రాం లో పాలు పoచుకోవడం ఆనందంగా వుంది. ఎందుకంటే, నేను ఈరోజు ఇలా ఉండానికి కారణమైన క్రమబద్ధమైన ప్రోగ్రాం ఇందులోనూ వుంది. ఇక ఎంతోమందికి నా అనుభవాన్ని అందజేయగలిగే అవకాశo లభించింది.
Vikram Hingmire
నా చిన్ననాటి మధురస్మృతులు, సృజనాత్మకమైన చోట్ల మీద, నిర్మించబడ్డ పర్యావరణం మీద నాకున్న ప్రేమను చిగురించేలా చేసాయి, ఒక చిన్న పొలంలో మా ఇల్లు వుంటే బావుంటుందని మా నాన్నగారు ఊహించేవారు, అందులో పలు రకాల మొక్కలు వెయోచ్చనే వారు, మా అమ్మ రకరకాల బాక్స్లు, తీగలతో అంతర్గత అలంకరణ చేసిన పత్రికల్లోని మొక్కలు, ఇవన్ని నన్ను లాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ వైపు తీసుకువెళ్ళాయి, ఈ చిత్రం లకు ఏనాటికైనా ప్రాణం పోస్తానన్న నమ్మకం కలిగింది. కానీ నేపధ్యంలో వైధ్యుడనయ్యే ప్రయత్నాలూ జరిగాయి, కానీ సృజనాత్మకత మాత్రం వీడలేదు, ఆహారం వండడంలో, ఇంటిలోని వస్తువుల్ని తరచూ మార్చి అమర్చడంలో, మొక్కలు ఎక్కువగా పెంచడంలో, గోడల మీద ఫ్రేమ్ లు వేసిన చిత్రాలలో బ్రతికే వుంది. లాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ నా జీవన రూపాంతరాలను కళతోనూ, ప్రకృతితోనూ బాగా దగ్గర చేసే అవకాశాన్ని అందించింది.
కానీ అంతులేని ప్రణాలికలు నా ఆశకు నన్ను దూరం చేసాయి, నా కళాత్మకతను నాలోని ఒత్తిడి మింగేసే పరిస్థితి వచ్చింది. ఆ ఒత్తిడిని తగ్గించి నా ఆత్మబలాన్ని నిలదొక్కు కోవడానికి నాకో దారి కావలసి వచ్చింది. ఆ దారి నాకు లో లభించింది. అది ధ్యానంలా పనిచేసింది. అనుభవాలను నమోదుచేయగలగడం, మాటలు లేకుండా కధ చెప్పగలగడం నన్ను ఆకర్షించాయి. నా మనోభావాలే నా ని గ్రహించాను. నా సృష్టిని ఏమాత్రం చెక్కు చేరరకుండా, మరింత బలంగా పెంపొందించే ఫ్రేమ్ లా మారింది. ఇప్పుడు నేను లాండ్స్కేప్ ని, ఆర్కిటెక్చర్ ని వెతికి ప్రోత్సహించడం నేర్చుకున్నాను, తద్వారా నా మనసులోని కధలను మళ్ళీ చెప్పగలుగుతున్నాను.
ఫోటోగ్రఫీ ఓ కళగా నేర్పించాలన్నది Light & Life Academy వారి వేదాంతం. నిరంతరంగా, ఊహలను నిజాలుగా మార్చే ప్రక్రియను సృజనాత్మకంగా అందిస్తుంది. విశ్వాoతరమైన ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించుకుని, ఫోటోగ్రాఫర్ లు కావాలన్న తపన కలిగిన వారిని LLA ఆన్లైన్ పది విభిన్న భాషలలో చేరుకుంటుoది. పలు విధాల నేపధ్యం గల వారికి సమాచారాన్ని అందించి ఫోటోగ్రాఫర్ ల మధ్య సోదరత్వాన్ని సృష్టించి, నెట్వర్కింగ్ కి కావలిసిన పునాదిని వేస్తుంది.